కొండలెన్నొ తవ్వుతారు
ఎలుకలెన్నొ పడతారు...
కరి మింగిన వెలగపళ్ళు
కష్టంగా కక్కుతారు.
మన నేతల తీరు వేరు.
మన ప్రభుతల రూటు వేరు
సమస్యలను తేల్చకుండ
తరతరాలు గడుపుతారు.
(టూజీ స్పెక్ట్రం కుంభకోణంపై జేపీసీని నియమించిన శుభ తరుణాన...)
ఇది నా కవనవనం. నా కవిత్వాన్ని మీతో పంచుకోవడానికి దీనిని మొదలుపెట్టాను. మీ అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను.
No comments:
Post a Comment