Pages

Search This Blog

amazon a-store

Tuesday, February 8, 2011

మీ మాటలే...

నిరంతరాయంగా ఓ రెండు గంటలు
మీతో గడిపేందుకు ఇక్కడకొస్తాను
మరో కవిత వినిపించడానికి,
నా సహచరుల కవితలు చదవడానికి...
తరచు ఇక్కడకు రావాలనుకుంటాను
నేను ఆత్మీయంగా హత్తుకున్న పదాలను
అర్థం చేసుకునే వాళ్ళకు దగ్గరగా ఉండేందుకు...
నిజానికి నేనిక్కడే నివాసముండాలి.

జీవితం, విధి నిర్వహణ
ప్రియురాలి ఆశలకు అంతరాయం కలిగిస్తుంటాయి
స్వల్ప సంతోషాలు మాత్రమే
మిగిలిన ప్రపంచంలోకి నన్ను లాక్కుపోతుంటాయి...
మరోసారి ఇక్కడ కనిపిస్తే నన్నాపి పలకరించండి
ప్రేమ పూర్వకమైన మీ మాటలే
నా కవి హృదయాన్ని పెంచి పోషిస్తాయి...

***
ఇంగ్లీష్: బాబీ డఫీ

No comments: