బండలను ఉడికిస్తూ నేను బతుకుతుంటా...
బండలను మెత్తని గుజ్జులా ఉడికిస్తుంటా...
బండలను ఉడికించి ఉడికించి ఉడికిస్తుంటా...
బండలను ఉడికిస్తుంటా, బతుకుతుంటా...
ఆకలితో కాదు,
ప్రేమ లేదు,
క్రోథం లేదు,
మరీ ఆశలూ లేవు.
బండలు కూడా...
బతకడానికి నేను వాటిని ఉడికిస్తుంటా...
నిష్కారణంగా
లక్ష్యం లేకుండా
సరిగా నా అంతరంగంలో కూడా...
జపానీస్: తకనో కికో
No comments:
Post a Comment