Pages

Search This Blog

amazon a-store

Monday, February 7, 2011



ముట్టడి 


మంత్రనగరి కవాటాలను దాటాలి-
పెద్దమెదడు వాడో, ప్రపంచ బ్యాంకు వాడో
తాళాన్ని వేలాడదీశాడు...
తెరిచేందుకు కీలక పదాన్ని కనిపెట్టాలి.

ఊతపదాలు, నీతి పదాలు, బూతు పదాలు;
ప్రియురాళ్ళ పేర్లు, ఊరవతలి ఏర్లు...
ఒక్కొక్కటిగా ప్రయత్నించాలి...
ఎలాగైనా తలుపులు తెరవాలి...
తప్పిపోయిన తలపులను వెతికి పట్టుకోవాలి.

***

నీకు నువ్వు నువ్వూ కావు,
నాకు నేను నేనూ కాను...
ఎవరికి వాళ్ళమే అపరిచితులం.
పరారైన మన పరిచయాలు
ఎక్కడున్నాయో పసిగట్టాలి.

***

చాటుగానో, పొరపాటుగానో-
సరి'హద్దులు' మీరి మరీ చొరబడాలి.
బతికిన క్షణాలను మళ్ళీ హత్తుకోవాలి
దాచిపెట్టుకున్న ఆయుధాలను పైకెత్తుకోవాలి
మంత్రనగరి నడిబొడ్డున మందుపాతర ముట్టించాలి.

***

No comments: