Pages

Search This Blog

amazon a-store

Monday, February 7, 2011

జ్ఞాపకాల చిత్తడి 


మబ్బులు  ముసిరితే చాలు
మబ్బుల్లాగానే  జ్ఞాపకాలూ ముసురుకుంటాయి
వర్షం కురుస్తుంది
మనసు నిండా జ్ఞాపకాల ఛిత్తడి
మెరుపులు మెరిస్తే
గుండెల్లో పిడుగులు-
వర్షం కురిస్తే చాలు 
ఫైకప్పు ఎందుకో ఏడ్చేది 
ఇల్లంతా భయంతో 
బితుకు బితుకుమనేది 

ఒంటరి క్షణాలు 
యుగాల్లా గడుస్తుంటాయి 
అనుదినమూ గండమే
అయినా ఆయువు అంత తొందరగా తీరదు 
పెంకులు రాలిన పైకప్పూ కూలిపోదు 
రోజులు లెక్కబెట్టుకోవడంలోనే
రోజులు గడచిపోతాయి 
గడచిన రోజుల గుర్తుగా 
కాసింత కవిత్వం 

వర్షాకాలపు విహ్వల జ్ఞాపకాల్లేకుండా
నేను లేను, నా గతం లేదు
తడిసిన బాల్యం ఆఖరు రోజుల్లో 
నన్ను పలకరించిన నా కవిత్వమూ లేదు.

వర్షం కురిస్తే చాలు 
జ్ఞాపకాల్లో తడిసిన గుండె 
చిత్తడి నేలవుతూ ఉంటుంది 
ఒక్క క్షణం భయం భయంగా 
బితుకు బితుకుమంటూ ఉంటుంది 

No comments: