Pages

Search This Blog

amazon a-store

Sunday, February 20, 2011

సంభాషణ


మనం మాట్లాడుకుంటాం...
రెండు వేర్వేరు గ్రహాలకు చెందిన వాళ్ళలాగ
ఒకటి ఉత్తరాన,
ఒకటి దక్షిణాన;

మనం మాట్లాడుకుంటాం...
శాపగ్రస్త వర్తమానాల గురించి,
ఆశావహ భావితవ్యాల గురించి 
మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేం.

నువ్వు అంటావు:
చూడు, ఎంత స్వచ్చమైన సూర్యోదయం
మన మాతృదేశపు చీకటి లోతుల 
సరిహద్దులను వెలిగిస్తోంది.

నేనంటాను:
నువ్వు కలగంటున్నావు! ఇది సూర్యోదయమే కాదు.
ఒక కొత్త మెరుపు 
మనల్ని దగ్ధం చేసే కొత్త మంటలకు సంకేతమిస్తోంది.

నువ్వు నిరసిస్తావు:
చాలించు నీ సిద్ధాంతాలను-
ఇప్పటికీ మనం నిండు చంద్రుణ్ణి చూడలేకపోతున్నాం,
మన కన్నీటి పొరల నుంచి...

నేను నీకు భరోసా ఇస్తాను:
ఈ రాత్రికి నిండు చంద్రుణ్ణి 
మనం కన్నీళ్ళతో కడిగేద్దాం.
ఇతరులైనా రేపటి దినాన్ని 
మరింత స్పష్టంగా చూడగలిగేలా...

మనం మాట్లాడుకుంటాం 
రెండు వేర్వేరు గ్రహాలకు చెందిన వాళ్ళలాగ-
రాత్రంతా పక్క పక్కనే కూర్చుంటాం 
ఒకే నెగడు ఎదురుగా;

ఇప్పుడు చెప్పు:
నీ కళ్ళను మెరుపు కత్తితో చీలుస్తూ 
ఉత్తర, దక్షిణ స్వర్గాలను 
వేరు చేస్తున్నదేది?
***
-లిథువేనియన్: లియోనార్డాస్ ఆండ్రికాస్

No comments: