Pages

Search This Blog

amazon a-store

Sunday, November 27, 2011

తీరిక దొరికిన ఏకాంతంలో...


నాతో నేనే చెప్పుకోని
రహస్యాల గుట్టు విప్పుకోవాలి.
ఆశాభంగాల భస్మరాశుల నుంచి 
ఆశావిహంగాలను
ఒక్కుమ్మడిగా ఎగరేయాలి.
చిక్కని బతుకు చీకటిలో 
ఎవరి చిరునవ్వుతోనైనా
వెలుగుపూలు పూయించాలి.

***
నన్ను నేనే క్షమించుకోలేని 
అపరాధాలపై ఆరా తీసుకోవాలి.
నేర్చుకోవలసిన గుణపాఠాలపై 
నిర్మొహమాటంగా 
సిలబస్ సిద్ధం చేసుకోవాలి.
దారి తప్పిన కూడలి నుంచి
ఎవరి ఆసరాతోనైనా 
రోడ్డు దాటాలి.

***
అంతశ్చేతనలో దాచిపెట్టిన కలలను
అక్షరాల్లోకి తెచ్చుకోవాలి.
అన్ని నిషేధాలను ధిక్కరించి 
అలుపెరుగని పాటను ఆలపించాలి.
చిరకాలంగా తప్పిపోయిన పదాలను 
ఎవరి చూపంటురాళ్ళతోనైనా
చటుక్కున వెతికి పట్టుకోవాలి.
వాయిదా వేస్తూ వస్తున్నా పద్యాలను 
ఇప్పుడిక వెంటనే రాయాలి.

***

5 comments:

రసజ్ఞ said...

వ్రాయండి ఇకనయినా ఆలస్యం చేయక!
నాతో నేనే చెప్పుకోని
రహస్యాల గుట్టు విప్పుకోవాలి.
బాగుంది

క‌వ‌న‌వ‌నం said...

ధన్యవాదాలు రసజ్ఞ గారు! రాయాలన్నదే సంకల్పం. కానీ కాలం కరుణించాలి కదా...

Saripalli Rama Rao said...

chaalaa baagundi.

ramarao saripalli

క‌వ‌న‌వ‌నం said...

Thank You Rama Rao garu

Rp said...

Bagundi dasu garu