Wednesday, March 30, 2011
Monday, March 28, 2011
Friday, March 25, 2011
ఆమె నిన్నిలా అడిగింది...
ఓ అమ్మాయి నిన్నిలా అడిగింది:
ఇంతకీ కవిత్వమంటే ఏమిటి?
ఆమెతో నువ్విలా చెప్పాలనుకున్నావు:
నువ్వు కూడా... అవును, నువ్వూ కవిత్వానివే...
సంభ్రమాశ్చర్యాలు గొలిపిస్తూ, అద్భుతాన్ని తలపించే
నీ సొగసరి సౌందర్యం నాకు అసూయ కలిగిస్తోంది.
ఎందుకంటే నిన్ను నేను ముద్దాడలేను,
నీతో శయనించలేను.
నా వద్ద ఇంకేమీ లేదు.
ఇచ్చేందుకు ఏమీ లేనివాడు కచ్చితంగా పాడి తీరాలి.
కానీ, నువ్విదేమీ చెప్పకుండానే మౌనంలో మునిగిపోయావు.
ఇంకా ఆమె నీ అంతరంగ సంగీతాన్ని విననేలేదు.
***
చెక్: వ్లాదిమిర్ హోలాన్
ఇంగ్లీష్: ఇయాన్ మిల్జర్
Sunday, March 20, 2011
ఉల్లంఘన
సరిహద్దులను,
గిరిగీతలను
చెరిపేద్దాం,
తుడిచేద్దాం...
పట్టరాని గగనమ్మీదికి
పట్టెడన్ని కలలను ఎగరేద్దాం.
చెరలో మగ్గిపోతున్న
పదాలను విడిపించి
పతంగులుగా మారుద్దాం...
***
స్వేచ్ఛా హరణాలన్నీ
నిశ్శబ్ద మానవ హననాలే-
ఆంక్షల కంచెలను దాటేసి,
ఆయుధాలను ఎక్కుపెడదాం.
కాలం చెల్లిన కత్తులను పారేసి,
క్షిపణులను సంధిద్దాం...
***
నిషేధాల నేపథ్యాలన్నీ
నిర్హేతుక, నిరర్థక
భయాజనితాలే-
సంకోచాలను వదిలేసి,
శాసనాలను తగలేద్దాం.
ఏకపక్ష నీతిచంద్రికలకు
నీళ్ళు వదిలేసి
హక్కులకు హామీ ఇచ్చే
న్యాయ శాస్త్రాన్ని
సరికొత్తగా రాసుకుందాం...
***
సరిహద్దులను,
గిరిగీతలను
చెరిపేద్దాం,
తుడిచేద్దాం...
కళ్ళాలు లేని కెరటాలను
కళ్ళలోకి స్వాగాతిద్దాం.
అరమరికలు లేనిచోట
అనుబంధాలకు అడ్డమొచ్చే
అదృశ్య కుడ్యాలను
ధిక్కార గీతాలతో
పెకలించి పారేద్దాం...
సమరాన్ని సాగించి,
రుధిరాన్ని చిందించి
స్వచ్ఛందంగా శ్వాసించుకుందాం...
***
Friday, March 18, 2011
Thursday, March 17, 2011
Sunday, March 13, 2011
మహాత్ముడి వారసులు
మన సెన్సార్ మెంబర్లు
మహాత్ముడికి వారసులు.
చెడు అనరు, చెడు కనరు
చెడును అసలు విననె వినరు.
(అ'మంగళ'ము ప్రతిహతమగుగాక)
మహాత్ముడికి వారసులు.
చెడు అనరు, చెడు కనరు
చెడును అసలు విననె వినరు.
(అ'మంగళ'ము ప్రతిహతమగుగాక)
Friday, March 11, 2011
Thursday, March 10, 2011
దాష్టీకం
బుద్ధిలేని నేతృత్వం
గడ్డి తినే యంత్రాంగం
ఇది ఎక్కడి దాష్టీకం?
విగ్రహాల విధ్వంసం.
విలువలన్ని పడగొడితే
ఉద్యమమైపోతుందా?
గురితప్పిన బాణంతో
లక్ష్యం సిద్ధిస్తుందా?
Wednesday, March 9, 2011
Monday, March 7, 2011
పాపాల 'భైరవం'
సీవీసీ కేసుతో
సీను మారిపోయింది
యూపీఏ పరువంతా
మూసీలో కలిసింది.
మన్మోహన రాగంలో
అపస్వరం దొర్లుతోంది...
సోనియమ్మ పాపాలకు
'భైరవం'గ మారుతోంది.
Friday, March 4, 2011
ఒక బాలుడు, అతడి తల్లి
" సముద్రమేనా గర్జిస్తోంది? "
సముద్రం ఎండిపోయి చాలా కాలమైంది.
" నా చెవులు మార్మోగుతున్నాయే? "
కేవలం నీకే వినిపిస్తుంది.
" రైలు? "
వెళ్ళిపోయి చాలా సేపైంది.
"ఎవరో గురక పెడుతున్నారు"
అందరూ వింటున్నారు.
"మంటలు. మంటలు గర్జిస్తున్నాయి"
తగలబెట్టేందుకు మరేమీ మిగల్లేదు.
"ఆకాశం చేసే చప్పుడో ?"
మొదటగా చావాల్సింది ఆకాశమే.
"మరేమిటైతే?"
నాకు తెలీదు.
"ఇది అంతం"
కాదు. ఇది కొనసాగాల్సిందే
"శబ్దం"
కాదు.
"కాలం"
కాదు.
"మనిషి"
కాదు.
"ఏది దేన్ని కొనసాగిస్తోంది?"
తెలీదు. ఎవరూ కాదు.
"మనమేం చేస్తున్నాం "
తెలీదు. బహుశా బతుకుతున్నాం.
అది నీకు తెలియక పోవచ్చు.
"నాకు తెలీదు! "
అవును. కచ్చితంగా అంతే. బతకడం.
కేవలం చచ్చే దాకా బతకడం.
***
జపనీస్: తకనో కికో
సముద్రం ఎండిపోయి చాలా కాలమైంది.
" నా చెవులు మార్మోగుతున్నాయే? "
కేవలం నీకే వినిపిస్తుంది.
" రైలు? "
వెళ్ళిపోయి చాలా సేపైంది.
"ఎవరో గురక పెడుతున్నారు"
అందరూ వింటున్నారు.
"మంటలు. మంటలు గర్జిస్తున్నాయి"
తగలబెట్టేందుకు మరేమీ మిగల్లేదు.
"ఆకాశం చేసే చప్పుడో ?"
మొదటగా చావాల్సింది ఆకాశమే.
"మరేమిటైతే?"
నాకు తెలీదు.
"ఇది అంతం"
కాదు. ఇది కొనసాగాల్సిందే
"శబ్దం"
కాదు.
"కాలం"
కాదు.
"మనిషి"
కాదు.
"ఏది దేన్ని కొనసాగిస్తోంది?"
తెలీదు. ఎవరూ కాదు.
"మనమేం చేస్తున్నాం "
తెలీదు. బహుశా బతుకుతున్నాం.
అది నీకు తెలియక పోవచ్చు.
"నాకు తెలీదు! "
అవును. కచ్చితంగా అంతే. బతకడం.
కేవలం చచ్చే దాకా బతకడం.
***
జపనీస్: తకనో కికో
Subscribe to:
Posts (Atom)